ఉద్యోగం పోయిందని.. మరో వ్యక్తితో లవర్ ఎంగేజ్ మెంట్

ఉద్యోగం పోయిందని.. మరో వ్యక్తితో లవర్ ఎంగేజ్ మెంట్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో  విషాదం చోటు చేసుకుంది.  తన ప్రియురాలికి  మరో వ్యక్తితో పెళ్లి కుదరడంతో మనస్తాపం చెంది24 సంవత్సారాల యువకుడు ఫ్యాన్​ కు ఉరేసుకొని  ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్​ రాజేంద్ర  సఖ్రే (24)  ఫిబ్రవరి 5న అమర్​ నగర్​ ప్రాంతంలోని తన ఇంటిలోని కిచెన్​ రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సఖ్రే గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశాడు.   ఉద్యోగం పోయి నిరుద్యోగిగా ఉన్నాడు,  తాను పెళ్లిచేసుకోవాలన్న స్నేహితురాలికి వేరొకరితో వివాహ నిశ్చితార్దం జరిగడంతో... మనస్థాపం చెందిన సఖ్రే ఆత్మహత్య చేసుకున్నాడు, వంటగదిలోని ఫ్యాన్​ ఉరేసుకొన్నట్లు సఖ్రే అమ్మమ్మ చెప్పిందని పోలీసులు తెలిపారు.  సఖ్రే అమ్మమ్మ చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

యువత, పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుటున్నారు.  ఇంట్లో తల్లి దండ్రులు మందలించిన తట్టుకోలేకపోతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. బలవన్మరణానికి పాల్పడుతున్న యువత సంఖ్య రోజు రోజుకు  పెరుగుతుంది.  నాగ్​ పూర్​ కు చెందిన 16 ఏళ్ల బాలికను ఆమె తల్లి దండ్రులు ఫోన్​ ఎక్కువుగా ఉనయోగించవద్దని చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల తరువాత సఖ్రే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  హింగ్నా పీఎస్​ పరిధిలోని మంగ్లీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

 ఆత్మహత్యలు ఇంతలా పెరగడానికి, గత సంవత్సరాలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో పరిశీలించాలి. ఫోన్​ వాడకం వలన వచ్చే నష్టాలను స్కూల్లో  లెసన్స్​ చెప్పించాలి.  జీవితంలో ఏదైనా దూరమైనప్పుడు దాని గురించే ఆలోచించకుండా.. వేరే పని చేయాలి.  దాని గురించే ఆలిచిస్తుంటే..  భరించలేక ఏదో ఒకరోజు ఆత్మహత్యకు పాల్పడతారు.  యూత్​ దేశానికి ఆదర్శంగా నిలవాలి కాని.. పిరికివానిగా... భయంతో ఇలాంటి ఘటనలకు పాల్పడకూడదు.. యూత్​ అంటే దేశం గర్వపడేలా ఉండాలి. .